Nadendla-Manohar - Pawan Kalyanఅమరావతి రైతులకు అండగా ఉంటామని చెప్పి.. వారి కోసమే బీజేపీతో కలిశామని చెప్పి ఆ తరువాత పవన్ కళ్యాణ్ మాట మార్చారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు గవర్నర్ క్లియర్ చేసిన వికేంద్రీకరణ బిల్లుల పై పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. ఏదో ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.

ఈ విషయంగా జనసేన ఒక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ‘‘ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు, ఇకపై భూసేకరణలు చేపడితే ప్రజలే ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారు నాగబాబు. అలాగే వికేంద్రీకరణ ప్రభుత్వ నిర్ణయం కాదు, వ్యక్తిగత అజెండా అంటూ అభిప్రాయపడ్డారు మరో నేత నాదెండ్ల మనోహర్.

మొత్తానికి రాజధాని వికేంద్రీకరణ మీద జనసేన టెలీకాన్ఫరెన్స్‌. రాజధానిపై న్యాయపోరాటం చేయాలి అని నిర్ణయించుకుందట. ఈ విషయంగా ఇప్పటికే అమరావతి పోరాట సమితి కోర్టులలో పోరాటం చేస్తుంది. మహా అయితే ఆ పిటీషన్లలో జనసేన ఇంప్లీడ్ అవుతుంది. దీనివల్ల రైతులకు కొత్తగా వచ్చే ఉపయోగం ఏమీ లేదు.

ప్రజాపోరాటాలు చేస్తేనో… లేదా గతంలో చెప్పినట్టు కేంద్రంలోని బీజేపీతో ఏదైనా అడ్డుపుల్ల వేస్తేనో ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ విషయంగా జనసేన ఏదో మొక్కుబడిగా చేతులు దులుపుకుంటే రైతులు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.