Pawan Kalyan Movie Katamrayudu, Pawan Kalyan Movie Title Katamrayudu, Pawan Kalyan Movie Title Katamrayudu Kadapa King, Pawan Kalyan Dolly Movie Katamrayuduఎస్.జే.సూర్య వెళ్ళిపోయిన తర్వాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ‘గోపాల గోపాల’ ఫేం డాలీ, స్క్రిప్ట్ కు తుది రూపం తీసుకువచ్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అలాగే ముందుగా భావించినట్లు ఈ సినిమా టైటిల్ ‘కడప కింగ్’ కాకుండా ‘కాటంరాయుడు’గా పవర్ స్టార్ కనపడనున్నారని కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాణ్ ఆలపించిన సూపర్ హిట్ సాంగ్ ‘కాటమరాయుడా…’ అనే పదంతోనే ప్రారంభమైన నేపధ్యంలో… ఈ ‘కాటంరాయుడు’ టైటిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సెప్టెంబర్ మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని ప్రచారం జరిగినప్పటికీ, మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో… పవన్ సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలో మీటింగ్ పెడుతుండడంతో, బహుశా సెకండ్ వీక్ లో సెట్స్ పైకి వెళ్తుందేమోనన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఈ కధను కేవలం 50 రోజుల షూటింగ్ లో పూర్తి చేయాలని దర్శకుడు డాలీకి పవర్ స్టార్ సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. సూర్య సినిమా ఆగిపోయిన తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందన్న వార్తలతో కలత చెందిన పవర్ స్టార్ అభిమానులకు, ఈ ‘కాటంరాయుడు’ సిద్ధమవుతుండడం సంతోషం కలిగించే విషయమే.