Pawan-Kalyan-Movie-Remunerationసినిమా పరిశ్రమ స్టార్ హీరోల ఆధిపత్యంలో మనుగడ సాగిస్తుంది. దీంట్లో వాదనకు తావు లేదు. ఏ భాషకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి సేఫ్ గా వెనక్కు వచ్చి, లాభాలు ఇస్తుందని నమ్మినప్పుడే నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టుబడులు కుమ్మరిస్తారు. కొన్నిసార్లు ప్రొడక్షన్ కాస్ట్ మించి పారితోషికాలు ఇచ్చిన ఉదంతాలు కోకొల్లలు.

లియో తర్వాత చేయబోయే సినిమా కోసం విజయ్ ఏకంగా రెండు వందల కోట్లు తీసుకుంటున్నాడనే వార్త చెన్నై మీడియాలోనే కాదు హైదరాబాద్ ముంబై సర్కిల్స్ లోనూ చర్చకు దారి తీసింది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం ఓ పబ్లిక్ ఫంక్షన్ లో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు కోట శ్రీనివాసరావు గారు అన్న మాటలు. ఎన్టీఆర్ కాలంలో ఇలా బయటికి చెప్పడం ఉండేది కాదని కానీ ఇప్పుడు రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నామని పబ్లిక్ గా ఒప్పుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదని అన్నారు.

ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఒక్కడే. అయితే ఇదేదో పెద్ద తప్పయినట్టు అంత అనుభవమున్న నటులు చెప్పడం వెనుక మర్మం ఫ్యాన్స్ కు అర్థం కాలేదు. గతంలోనూ కులం విషయంలో కోట ఇలాగే కామెంట్స్ చేశారు ప్రపంచంలో ఎవరైనా సరే తమ ఆదాయాన్ని బాహాటంగా చెప్పుకునే హక్కు ఉంది. సుందర్ పిచ్చయ్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో వరల్డ్ మొత్తం తెలుసు. ముఖేష్ అంబానీ ఆస్తుల లెక్క గూగుల్ కొట్టినా వస్తుంది.

బిల్ గేట్స్ సంపద గురించి ఏ బిజినెస్ వెబ్ సైట్ కి వెళ్లినా వివరాలుంటాయి. అలాంటప్పుడు ఫలానా నటుడు లేదా నటి నాకింత ఇస్తున్నారని చెప్పడం క్రైమ్ ఎలా అవుతుంది. ఆ మాటకొస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలోనూ రెమ్యునరేషన్లు ఎలా ఉండేవో వాళ్లే ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని సంగతులు ఉండటం వాస్తవం. సినిమా వాళ్ళు కాబట్టి బయటికి ఏదీ చెప్పకూడదు అనుకోవడం అమాయకత్వం. ఆర్ఆర్ఆర్ కు ఎంత ఖర్చయ్యిందో చెప్పకపోతే ఆడియన్స్ కి అందులో భారీతనం ఎలా అవుతుంది.

పవన్ ప్రభాస్ మహేష్ చరణ్ తారక్ బన్నీ ఎవరైనా సరే తమ మార్కెట్ కి తగ్గట్టే డిమాండ్ చేస్తారు తీసుకుంటారు. అంత ఇవ్వలేని వాళ్ళు, పెట్టుబడి పెట్టలేని వాళ్ళు సైలెంట్ అవుతారు. అంతే తప్ప బిజినెస్ ఆగదు. జనసేన నడుపుతూ తానెందుకు సినిమాలు చేస్తున్నాననే విషయం మీద పవన్ రోజుకు రెండు కోట్లని చెప్పాల్సి వచ్చింది కానీ, నాకు ఇంత ఇమ్మని కాదు, ఇంత డిమాండ్ ఉందని బిల్డప్ ఇవ్వడమూ కాదు. ప్రజాస్వామ్యంలో నిజాలు కూడా గుట్టుగా ఉండాలంటే ఎలా