pawan kalyan Mahesh babu Movies Release Updatesసూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి సీజన్ లో అన్ని డేట్స్ కంటే బెస్ట్ డేట్ సర్కారు వారి పాట అనే చెప్పుకోవాలి.

జనవరి 13 అంటే గురువారం విడుదల.. జనవరి 14 భోగి పండుగ రోజు మరియు దాని తరువాత వారాంతపు సెలవులు ఉంటాయి. కాబట్టి, సినిమా సంక్రాంతికి పూర్తి ఎడ్వాంటేజ్ పొందడానికి 13 వ తేదీ సరైన తేదీ అవుతుంది.

ముందుగా పవన్ కళ్యాణ్ – రానా సినిమా ఈ తేదీకి విడుదల చెయ్యాలని అనుకున్నారు. అయితే సంక్రాంతి విడుదల అని చెప్పేసి ఊరుకున్నారు. దానితో ఆ డేట్ మహేష్ ఎగరేసుకుని పోయాడు. దానితో పవన్ కళ్యాణ్ 12న రావాల్సిన పరిస్థితి.

ఆ సినిమా 12న వస్తే… సర్కారు వారి పాటకు మొదటి రోజు థియేటర్లు కొంత ఇబ్బందే. అయితే లాంగ్ రన్ లో మాత్రం సర్కారు వారి పాట కే బెనిఫిట్… అయితే పవన్ సినిమా తరువాత మూడు సినిమాలు విడుదల అవుతాయి.

మూడు సినిమాలకు థియేటర్లు పోగొట్టుకుంటూ పోతే… ఎక్కువగా నష్టపోయేది ఆ సినిమానే అని చెప్పుకోవాలి. అనవసరంగా డేట్ అనౌన్స్ చెయ్యడానికి మొహమాటపడి పవన్ పెద్ద అవకాశాన్ని చేజార్చుకున్నాడు.