Pawan Kalyan links jammu kashmir issue with kapu reservationప్రస్తుతం భీమవరం పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం. “కాపు రిజర్వేషన్లు అంశంపై ప్రభుత్వం ఏదొక నిర్ణయం తీసుకోవాలి, లేని పక్షంలో భవిష్యత్తులో మళ్ళీ ఇదే సమస్య వస్తుంది. జమ్మూ & కాశ్మీర్ లాంటి సమస్యకే పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నప్పుడు కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ గారు నిర్ణయం తీసుకోగలుగుతారు అనుకుంటున్నాను,” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

“కాపుల రిజర్వేషన్లు విషయంలో మాటలు మార్చడం సరికాదు, కాపులు OC కాదు, BC కాదు అని జగన్ గారు అనడం సరి కాదు,సమస్యకు పరిష్కారం దిశగా మీరు ఆలోచిస్తున్నట్లు నాకు అనిపించడం లేదు,” అని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. అయితే కాశ్మీర్ సమస్యకు కాపు రిజర్వేషన్లకు లింకు పెట్టడాన్ని పలువురు సోషల్ మీడియాలో ఆక్షేపిస్తున్నారు. కొందరు గతంలో కాపులను నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ అంశాన్ని పలుమార్లు స్పృశించడం విశేషం.

గతంలో తనని తాను అందరివాడిలా చూపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఈ విషయానికి దూరంగా ఉండటం చేశారు. ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత తమకు మద్దతు ఇచ్చే సామాజికవర్గాల పక్షాన్న నిలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గుర్తించారని జనసైనికులే వ్యాఖ్యానించడం విశేషం. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పర్యటిస్తున్న భీమవరం మొన్నటి ఎన్నికలలో ఆయన పోటీ చేసి ఓడిపోయిన రెండు నియోజకవర్గాలలో ఒకటి కావడం విశేషం.