Pawan Kalyan turned Pro-KCRవరుసగా మీడియాలలో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ను ప్రశంసించడానికి గల కారణాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ చాలా విజయవంతంగా నడిపించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ వ్యవసాయానికి, భూమికి మిక్కిలి ప్రాధాన్యత, అమితమైన గౌరవం ఇవ్వడం తనకు బాగా నచ్చిన అంశాలని పవన్ పేర్కొన్నారు.

తెలంగాణ అంటే తనకు ఇష్టమని, తెలంగాణలోనే తాను ఎక్కువగా పెరిగానని, తెలంగాణా యాస, సంస్కృతిపై తనకు పట్టు ఉందని, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల రెండు సంస్కృతులు విభిన్నమైనవని పవన్ విశ్లేషించారు. తెలంగాణ నుంచే తనకు ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని, నాకు బాగా నచ్చడం వలనే తన చిత్రాల్లో తెలంగాణ యాసకు ప్రాధాన్యమిచ్చానని, పాటల ద్వారా కొందరిని ప్రోత్సహించానని చెప్పుకొచ్చారు.