Pawan Kalyan Kurnool rally for minor rape caseఓవైపు వరుస సినిమాలకు కాల్‌షీట్లు ఇచ్చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయ అంశాల్లోనూ బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచీ కోట్ల కూడలి వరకూ పవన్ ర్యాలీ నిర్వహిస్తారు. తర్వాత కోట్ల కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు పవన్.

కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థినిపై జరిగిన 14 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేయబోతున్నారు. మూడు నెలల కిందట కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ఈ కేసుపై ఆరా తీశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే మళ్లీ ఆందోళన చేస్తానని హెచ్చరించారు.

అయితే పవన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఆయన పర్యటనకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ కేసుని సిబిఐకి అప్పగించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. తమ నాయకుడి దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చిందని జనసైనికులు అంటున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ కర్నూల్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఆ తరువాత ఒక్క రోజు బ్రేక్ తీసుకుని అమరావతి గ్రామాల పర్యటనకు వెళ్తారు. మూడు రాజధానులు వ్యతిరేకంగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటిస్తారు.