Pawan-Kalyan's-Filmy-Remark-Sets-Twitter-Afire!!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిన్న సోషల్ మీడియాలో ఒక గాలి వార్త సోషల్ మీడియాలో హుల్ చల్ చేసింది. పవన్ కళ్యాణ్ మొన్న తూర్పు గోదావరి టూర్ ను అర్ధాంతరంగా ఆపి ముంబై వెళ్ళి అక్కడ తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ను కలిశారని, మహాకూటమికి నష్టం కలిగేలా కొన్ని సీట్లలో జనసేన అభ్యర్థులను పెట్టడానికి 80 కోట్లకు డీల్ కుదిరినట్టు ఆ వార్త సారాంశం. పవన్ కళ్యాణ్ కేటీఆర్ ఒకే రోజు ముంబై లో ఉండడంతో ఈ వార్త బాగా వ్యాపించింది.

నామినేషన్లు దాఖలు చెయ్యడానికి ఈ రోజే చివరి రోజు. దీనితో ఇది పవన్ కళ్యాణ్ ను జనంలో పల్చన చెయ్యడానికి ప్రత్యర్ధులు పుట్టించిన గాలివార్త అని తేలిపోయింది. జనసేనలో తెలంగాణాలో బలం లేదు. పైగా అకస్మాత్తుగా వచ్చిన ఎన్నికలతో ఆ పార్టీ పూర్తిగా ఇరుకున పడిపోయింది. దీనితో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉన్నారు. పోటీ చేసి సరైన ఫలితాలు రాకపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద పడుతుంది భావించి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.

జనసేనతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ కూడా అదే కారణంగా తెలంగాణాలో పోటీ చెయ్యలేదు. దీనితో ఆ రెండు పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ మీద తమ పూర్తి అస్త్రశస్త్రాలు ఉపయోగించబోతున్నాయి. కనీసం ఏ ఒక్క పార్టీకి కూడా ఈ ఎన్నికలలో తమ మద్దతు ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ తో జత కలిసినందుకు టీడీపీని టార్గెట్ చెయ్యడానికే ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు ఆ ఇద్దరు నాయకులు. అయితే అక్కడ మహాకూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఇద్దరికీ ఇబ్బందే.