List-of-Pawan-Kalyan's-Borrowed-Moviesదర్శకుడు క్రిష్ తో తన తదుపరి చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా పీరియడ్ డ్రామా చేస్తున్నాడని మన పాఠకులకు తెలిసిందే. ఈ చిత్రబృందం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సెట్లను ఏర్పాటు చేసింది. గత వారంలో హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా 1.5 కోట్ల విలువైన సెట్ చాలా వరకు ధ్వసం అయిపోయిందని సమాచారం.

కరోనా వైరస్ లాక్డౌన్కు ముందు ఈ సెట్లో కేవలం రెండు రోజుల షూట్ మాత్రమే జరిగింది. సెట్‌ను నిర్మించిన ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్, షూట్ ప్రారంభమైనప్పుడు కొన్ని భాగాలను తిరిగి నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నష్టాన్ని అంచనా వేయడం కుదరదు అంటున్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాతే షూట్ ప్రారంభమవుతుంది.

పవన్ కళ్యాణ్ మొదటిగా వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమా విషయం చూస్తారు. ఈ లోగా వర్షాకాలం కూడా పూర్తి అవుతుంది. కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందట. ఆ వజ్రాన్ని కాకతీయుల దగ్గర నుండి అల్లావుద్దీన్ ఖిల్జీ దొంగలించాడట. అక్కడ నుండి బాబర్ వద్దకు… ఆ తరువాత కొన్ని చేతులు మారి 1850లో ఆంగ్లేయుల దగ్గరకు చేరిందట.

షాజహాన్ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఒక దొంగల ముఠా తస్కరించడానికి ఏం చేసింది అనే ఊహాజనితమైన కథ ఈ సినిమా అని అంటున్నారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం ఆయనకు ఇదే మొదటి సారి. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.