pawan-kalyan-katamarayudu-title-song-leakedమిగిలిన హీరోల అభిమానుల కంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ రెండు ఆకులు ఎక్కువన్న విషయం సోషల్ మీడియా విజ్ఞులకు విదితమే. పవన్ ఫస్ట్ ప్రకటిస్తే… అంతకుముందే ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది… పవన్ సినిమా టైటిల్ ప్రకటిస్తే… మరుక్షణమే లోగో వచ్చేస్తుంది… ఇలా ఒకటేమిటీ, పవన్ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అంశం విడుదలైనా… వాటితో పవన్ అభిమానులు సొంతంగా రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేయడం పరిపాటిగా మారిపోయింది.

ఆ క్రమంలోనే పవర్ స్టార్ తాజా సినిమా “కాటమరాయుడు”కు సంబంధించిన టైటిల్ సాంగ్ ను సోషల్ మీడియాలో లీక్ చేసారు. అయితే ఇది నిజంగా సినిమా కోసం రూపొందించిన పాట కాదు. ఔత్సాహికులైన పవన్ అభిమానులు, తమ అభిమానాన్ని చాటుకోవడానికి చేసిన పాట. పవర్ ఫుల్ లిరిక్స్ తో ‘కాటమరాయుడు’ టైటిల్ వచ్చేలా రూపొందించిన ఈ పాటను యూ ట్యూబ్ లో ‘లీక్’ పేరిట విడుదల చేసారు. ఈ పాట వింటే ఖచ్చితంగా సినిమా కోసం రూపొందించిన పాట కాదని ఇట్టే తెలిసిపోతుంది.

ఈ పాటను రూపొందించేటప్పుడు ఒక విషయాన్ని ఈ లీక్ రాయుళ్ళు మరిచినట్లున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అనూప్ సంగీతం అంటే చక్కగా ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంటుంది. కానీ ‘కాటమరాయుడు’ లీక్ పేరుతో యూ ట్యూబ్ లో లీక్ చేసిన ఈ పాట సంగీతం అనూప్ మ్యూజిక్ కు ఏ మాత్రం గుర్తుకు తేకపోగా, ఏదో ఓ ప్రైవేటు పాట మాదిరి ఉంటుంది.