Pawan Kalyan Kamal Haasan-ఒక పక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , మరో పక్క యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, ఇంకో పక్క తమిళ తలైవార్ రజనీకాంత్…ముగ్గుగు టాప్ హీరోలు ముగ్గురి అజెండా ఒక్కటే పొలిటికల్ లీడర్ గా చక్రం తిప్పాలి అని. అయితే ఇందులో రజని ఇంకా తన రాజకీయ ప్రస్థానం ఫుల్ గా మొదలయితే పెట్టలేదు కానీ, రేపో మాపో ఆయన కూడా దుకాణం తెరుస్తాడు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక కమల్, పవన్ ఇద్దరూ పొలిటికల్ పార్టీ పెట్టుకుని ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ ముందుకు పోతున్నారు.

ఈ క్రమంలో ఒక్కసారి మనం ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ పార్టీలపై ఒక లుక్ వేస్తే, ఈ రెండు పార్టీలకు భారీ అభిమానులే ఉన్నారు…కానీ వారు పార్టీలకన్నా ఆ హీరోలకు అభిమానులు..అయితే సినిమా అభిమానం ఓట్ల రూపంలో మారుతుందా అంటే…కష్టమే అని ఎన్నో పర్యాయాలు ఎంతో మంది చేతులు కాల్చుకుని మరీ రుజువు చేశారు…ఉదాహరణకి మెగాస్టార్ పీఆర్‌పీనే. సరే ఇదిలా ఉంటే నిన్న ఒకానొక టీవీ ఛానెల్ ఓపెన్ హార్ట్ లో ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్, సినిమాల్లో ఒకప్పటి టాప్ హీరోయిన్, తమిళ ప్రజలకు దేవత లాంటి మనిషి (ఒకప్పుడు) మాట్లాడుతూ, పవన్ పార్టీ గురించి తనకు ఏమీ తెలీదు అని, అసలు ఆయన ఒక పార్టీ పెట్టినట్లు నిజంగా తనకు తెలీదు అంటూ చెప్పడంతో ఆ ఇంటర్‌వ్యూ చేస్తున్న మీడియా వ్యక్తితో పాటు ఆ ఇంటర్‌వ్యూ ను వీక్షిస్తున్న వారంతా అవాక్కు అయ్యారు. అయితే అదేదో పొలిటికల్ రైవలరి అని కొట్టి పాడేయ్యలేం…ఎందుకంటే ఆమె ఉన్న పార్టీ, కి పవన్ పార్టీకి మధ్య ఎక్కడ పొలిటికల్ వార్ లేదు.

ఇక కమల్ పార్టీ పరిస్థితి కూడా అదే…నిజంగా ఆయన పార్టీ గురించి పెద్దగా ఎవ్వరికీ ఏమీ తెలీదు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే…యువతలో మార్పు రావాలి, యువత మేల్కోవాలి, అన్న ఆలోచనతో, ప్రజల్లో మార్పు కోసం ప్రజల్లోకి వచ్చిన ఈ ఇద్దరు బడా హీరోలు ఆ రేంజ్ లో పార్టీలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు అన్నది స్పష్టంగా చెప్పవచ్చు. “ఆప్” అనే పార్టీ మొదలు పెట్టినప్పుడు యువత మొత్తం ఆ పార్టీ వైపే ఉంది…ఆప్ అధినేత సినిమా హీరో కానప్పటికీ. అయితే ఆ తర్వాత ఆ పార్టీ ఎలా మనుగడ సాగించింది అన్న విషయం పక్కన పెడితే, అసలు ముందు యువత, ప్రజలు కొత్త పార్టీని ఎందుకు ఎంచుకోవాలి అన్న ద్వారం దగ్గరే ఈ కొత్త పార్టీలు దారులు మూసేస్తున్నాయి..బహుశా అందుకే యువత తమ హీరోలపై అభిమానంతో కదిలినా, చివరకు నమ్మి వారిని గెలిపించే ఆలోచన చెయ్యడం లేదు. మరి అంత ఫాలోయింగ్ ఉండి కూడా ప్రజలను నమ్మించలేకపోతున్నారు అంటే, ఎక్కడ తప్పు జరుగుతుందో అర్ధం చేసుకుని సరిదిద్దుకోగలిగే చతురత మన హీరో కమ్ పొలిటికల్ లీడర్స్ కి ఉండాలి అని చెప్పక తప్పదు.