Pawan-Kalyan-Brings-Jaya-Prakash-Narayana-into-Proposed-JACవిభజన హామీలు అమలు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అందరం కూర్చొని వేదిక ఏర్పాటు చేయాలన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన కాసేపటి క్రితం ఆయన లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణను కలిసి ఆయన మద్దత్తు అడిగారు.

జేపీతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసారు. చంద్రబాబుని ఉద్దేశించి అన్నట్టుగా ప్యాకేజీ అద్భుతం అన్నారు.. మళ్లీ ఇప్పుడు ప్యాకేజీ బాగలేదు అంటున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ అవగాహనరాహిత్యం అనుకోవాలా? అనేది అసలు ప్రశ్న? ప్యాకేజీ బాగాలేదని ఎవరు అన్నారు?

స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదు అన్నాకా చంద్రబాబు స్పెషల్ ప్యాకేజీతో సర్దుకుపోయారు. స్పెషల్ ప్యాకేజీని సరిగ్గా అమలు పరిస్తే చాలా వరకు ఇబ్బంది ఉండేది కాదు. అయితే కేంద్రం ఆ పని కూడా చెయ్యలేకపోయింది. చెయ్యలేకపోయింది అనేకంటే అమలు చేసే చిత్తశుద్ధి బీజేపీకి లేదని అనుకోవాలి.

అంతే తప్ప స్పెషల్ ప్యాకేజీ బాగాలేదని చంద్రబాబు ఎప్పుడు అనలేదు. మరి పవన్ కళ్యాణ్ కు స్పెషల్ ప్యాకేజీ బాగా లేదు అని చంద్రబాబు అన్నట్టుగా ఎందుకు అనిపించిందో మరి. ఈ నెల 11న ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలిశాక పవన్ కళ్యాణ్ లో ఇంకొన్ని మార్పులు రావొచ్చు చంద్రబాబుకు వ్యతిరేకంగా అని టీడీపీ అభిమానులు అంటున్నారు.