Pawan kalyan janasena splits tdp votesపవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వచ్చింది ఒక్క సీటే అయినా ఆ పార్టీ ఈ ఎన్నికలలో తీవ్రమైన ప్రభావమే చూపించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి టీడీపీకి లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ వారు భావించినా అలా జరగకపోగా రాష్ట్రంలోని 8 లోక్‌సభ, 31 శాసనసభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలను దెబ్బ తీసింది. ఆయా నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వారికి వచ్చిన మెజారిటీ కన్నా కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, ప్రత్తిపాడు (తూ.గో), పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, గన్నవరం, కొత్తపేట, నిడదవోలు, ఆచంట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు (గుంటూరు), గుంటూరు తూర్పు, నెల్లూరు నగరం నియోజకవర్గాల్లో జనసేన సాధించిన ఓట్లు తెదేపా విజయావకాశాలను దెబ్బతీశాయి.

ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపించింది. గత ఎన్నికలలో వీటి కింద ఉన్న నియోజకవర్గాలలో టీడీపీ భారీగా గెలిచింది. విశాఖపట్నం లాంటి ఎంపీ నియోజకవర్గంలో టీడీపీ ఓటర్లు జనసేనకు క్రాస్ ఓటింగు చేసినట్టు క్లియర్ గా తెలిసింది. అయితే జనసేన దెబ్బ తీసినా ఈ ఓటమి పూర్తిగా ఆ పార్టీని నిందించలేం. ప్రభుత్వ వ్యతిరేకత క్లియర్ గా వచ్చింది. ఎందుకో ఏమిటో సమీక్షించుకోవాలి.