Pawan Kalyan Janasena not participating in local electionsఎదురుకున్న మొదటి ఎన్నికలలో జనసేనకు కేవలం ఒక్కే ఒక్క సీటు తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. కేవలం 5% పై చిలుకు ఓటు షేర్ తో అప్పటి ప్రజారాజ్యం పార్టీ కంటే పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీనితో పార్టీ మనుగడ మీదే అనుమానాలు మొదలయ్యాయి.

మంగళగిరిలో కొన్ని రోజుల నుండి జనసేనాని ఓటమిపై సమీక్షలు జరుపుతున్నారు. అదే సమయంలో ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. 175 సీట్ల అసెంబ్లీలో 151 సీట్లు సాధించి ఊపు మీద ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని స్థానిక సంస్థల ఎన్నికలూ పెట్టి ప్రతిపక్షాలు కోలుకునే లోపే మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహం పన్నుతోంది. అయితే ఈ ఎన్నికలకు జనసేన ఏ మాత్రం సన్నద్ధంగా లేదు. ఈ ఎన్నికలకు గ్రామస్థాయి నుండి వ్యవస్థ ఉండాలి.

అది లేకపోవడం ఇటీవలే ఎన్నికలలో జనసేనకు మైనస్ అయ్యింది. పోటీ చేసి ఘోరమైన ఫలితాలు వస్తే ఇబ్బంది అని, పోటీ విరమించుకోవడమే మంచిదని పార్టీలో మెజారిటీ అభిప్రాయమట. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా ఒక హింట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఎన్నికల గురించి అడగ్గానే సమీక్షలు పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక అవగాహనకు వస్తామని ఆయన చెప్పడం దానికే సంకేతామంటున్నారు. 2009 ఎన్నికల ఓటమి తరువాత జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికలలో అప్పటి ప్రజారాజ్యం పార్టీ ఇదే కారణంగా పోటీ చెయ్యలేదు.