Pawan Kalyan - JanaSena -Partyమూడు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒకింత ఆవేశంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు కురిపించారు. పవన్ కళ్యాణ్ నిత్య పెళ్ళికొడుకని, నలుగురిని పెళ్లి చేసుకున్నాడని. నాలుగేళ్లకోసారి భార్యలను మారుస్తారని, .ఒక పెళ్ళాం ఉండగానే ఇంకొకరితో పిల్లలని కన్నారని ఇలా జగన్ రెచ్చిపోయి విమర్శలు చేశారు. ఇలాంటి వాడు నా గురించి కామెంట్ చెయ్యడమా అంటూ విరుచుకుపడ్డారు.

దీనితో జగన్ పై పవన్ విరుచుకుపడటం ఖాయమని, అనంతపురం పర్యటనలో పవన్ ఆయనకు తగిన రీతిలో సమాధానం చెబుతారని జనసైనికులతో పాటు అందరూ అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ పవన్ కళ్యాణ్ జగన్ పై ఎటువంటి దాడి చెయ్యలేదు. ఎప్పటిలానే అసెంబ్లీకి వెళ్లడం లేదు వంటి రొటీన్ విమర్శలే చేస్తున్నారు. జనసేన పార్టీని తాము గుర్తించడం లేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జనసేన పార్టీకి వైసీపీ గుర్తింపు అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు.

అయితే పవన్ నుండి ఇంత సాదాసీదా స్పందన రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు మాటకు రెండు మాటలతో బదులిచ్చే పవన్ కళ్యానేనా అని ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ కోపం నరం తెగిపోయిందా? అంటూ చర్చించుకుంటున్నారు. అయితే దీనిని విశ్లేషకులు మాత్రం వేరేగా చూస్తున్నారు. వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా చర్చ జరిగితే అది కొంత మేర నష్టం జరగొచ్చని పవన్ భావిస్తున్నారట. దేనితో ఈ విషయాన్నీ అక్కడితో వదిలేస్తే బెటర్ అని అనుకుంటున్నారేమో

అదే సమయంలో ఇటువంటి చీప్ విమర్శలకు బదులు చెప్పకపోతే ప్రజలు పవన్ కళ్యాణ్ ను పరిణితి కలిగిన నాయకుడిగా చూస్తారని రాజకీయాలలో ఆ ఇమేజ్ అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ప్రజలలో జగనే పలచన అవుతారని ఆయన అభిప్రాయమట. గతంలో ఆయనకు ఉన్న ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ లాంటి ఇమేజ్ ను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టే ప్రయత్నాలు ఇటీవలే చేస్తున్నారు. దీనితో కొన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువకావొచ్చని పవన్ కళ్యాణ్ ఉద్దేశమట.