Pawan Kalyan Janasena Party office controversyగుంటూరు జిల్లా చినకాకాని వద్ద పార్టీ కార్యాలయం కోసం జనసేన దాదాపు మూడు ఎకరాల భూమిపై వచ్చిన వివాదం మన అందరికి తెలిసిందే. ఆ భూమి తమదంటూ మైనార్టీ ముస్లిం వర్గానికి చెందిన కొందరు తెరపైకి రావడం, వివాదం రుజువైతే వదులుకుంటాం అని పవన్ కళ్యాణ్ చెప్పడం వెంటనే జరిగిపోయాయి.

అదే సమయంలో వైకాపాకు చెందిన గౌతమ్ రెడ్డి సమక్షంలో ఆరోపణా ప్రెస్ మీట్ జరగడం అనుమానాలకి తావిస్తోందని పవన్ ప్రస్తావించడం గమనార్హం. గౌతం రెడ్డి ఆ మధ్య వంగవీటి రంగా పై అనుచిత వ్యాఖ్యలు చేసి వైసిపి నుండి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన అనధికారంగా వైసిపి నేతగానే కొనసాగుతున్నారు.

దీనితో ఎటువైపు నుండి కుట్ర జరుగుతుంది అనేది చెప్పడం పెద్ద కష్టమేమి కాదు. ఇప్పటికే జగన్ కు వ్యతిరేకంగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనితో మరింత దూరం అవ్వడం ఖాయం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరు దానిని గుర్తించకుండా పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టాలని చూడటం జగన్ అవివేకమని చెప్పుకోవాలి.