Pawan-Kalyan---Janasena-Party-Fans-disoppointedబీజేపీ జనసేన పార్టీలు పొత్తు ప్రకటించాకా జరుగుతున్న మొదటి ఎన్నికలు… జీహెచ్ఎంసి ఎన్నికలు. అయితే ఆ ఎన్నికలు రెండు పొత్తు వరకు రసాభాసగా జరిగాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మొదట జనసేనతో పొత్తు ఉండదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడంతో జనసేన ఒంటరిగా పోటీ చేస్తాం అని ప్రకటించింది.

ఆ తరువాత ఉన్నఫళంగా పొత్తు చర్చలు జరగబోతున్నాయి అని జనసేన అధికారికంగా ప్రకటించింది. ఆ వెంటనే సంజయ్ మరోసారి మీడియా ముందుకు వచ్చి అటువంటిది ఏది లేదని చెప్పారు. బీజేపీ నాయకత్వం జనసేన ను పోటీ నుండి తప్పించడానికి ట్రై చేసి ఆ తరువాత ఆ పార్టీ పోటీ చేసినా ప్రజలు సీరియస్ గా తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా చర్చలు అని చెప్పి పవన్ కళ్యాణ్ ని అవమానించారని జనసేన వారే చెబుతున్నారు.

ఆ తరువాత జనసేన మొదటి లిస్టు అంటూ ఆ పార్టీ హడావిడి చేసినా అటువంటిది ఏమీ జరగలేదు. అసలు ఆ పార్టీ నేతలు ఎవరూ నామినేషన్ వేసినట్టుగా కూడా వార్తలు లేవు. కాసేపట్లో నామినేషన్ల గడువు పూర్తి కాబోతుంది. దీనీతో జనసేనాని బీజేపీ వారి ఒత్తిడికి తలొగ్గారనే అనుకోవాలి.

పొత్తు ఉంటే రెండు రాష్ట్రాలలో ఉండాలని.. తమకు అవసరమైన చోట పొత్తు పెట్టుకుని, అక్కర్లేని చోట మోసం చెయ్యాలని చూడటం తగదని… తిరుపతి బై-ఎలక్షన్ లో బీజేపీకి బుద్ధి చెప్పాలని… పార్టీ తరపున ఖచ్చితంగా కాండిడేట్ ని పెట్టాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారిని పవన్ కళ్యాణ్ పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? లేదా ఎప్పటిలానే బీజేపీ నాయకత్వంతో రాజీ పడతారా?