Pawan Kalyan JanaSenaరాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ ఎన్నికలలో అంతా ఊహించినట్టుగానే అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. పార్టీ రహిత ఎన్నికలు కాబట్టి కొంత మేర వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు ఫలితాలు తమకు అనుకూలంగా చూపించుకునే ప్రయత్నం చేశాయి.

మరోవైపు… జనసేన బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలలో పెద్దగా ప్రభావం చుపించాలేకపోయాను. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ… “తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయి.. జనసేన భావజాలంతో పోటీలో నిలిచిన అభ్యర్థులకు 18 శాతం ఓట్లు వచ్చాయి,” అని చెప్పుకొచ్చారు.

పంచాయతీ ఎన్నికలలో ఓట్ల శాతం లెక్కించడం దాదాపుగా అసంభవం. అదే సమయంలో మెజారిటీ చోట్ల టీడీపీ రెండో స్థానంలో ఉన్నాం అని కూడా చెప్పుకున్నారు. ఇటువంటి ఎన్నికలలో పార్టీలు తమ ఫలితాలను మరింత ఎక్కువ చేసి చెప్పుకోవడం మాములే అయినా జనసేనకు అటువంటి ప్రయత్నం మంచిది కాదు.

గ్రామా స్థాయిలో పార్టీకి నిర్మాణం, నాయకత్వం అంటూ లేదు. ఆ కారణంగా కూడా ఫలితాలు ఘోరంగా వచ్చాయి. వాటిని కప్పిపుచ్చుకుని అంతా బానే ఉందని చెప్పుకుంటే అసలుకే మోసం జరగొచ్చు. అటువంటి ప్రయత్నం టీడీపీ… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేసినా వారికి పార్టీ నిర్మాణంలో ఇబ్బందులు లేవు. జనసేనలో మాత్రం ఫలితాలపై నిర్దిష్టమైన విశ్లేషణ జరిగితేనే ఉపయోగం.