Pawan Kalyan JanaSena One day-Padayatraఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చుకొనేందుకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ఈ రోజు విజయవాడలో జరిగిన సీపీఎం, సీపీఐ, జనసేన నేతల భేటీ అనంతరం ఉమ్మడి కార్యాచరణ ప్రకటించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ఇప్పటివరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన, చేస్తోన్న నమ్మక ద్రోహానికి నిరసనగా ఉదయం 10గంటల నుంచి వూరూరా పాదయాత్రలు చేపట్టాలని జనసేన, సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా వారు అభివర్ణించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ 6న పాదయాత్రలు చేపడతాం అని ప్రకటించారు. ప్రధానంగా జాతీయ రహదారులపైనే ఈ పాదయాత్ర జరుగుతుంది. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో అక్కడి ముఖ్య కూడలిలో పాదయాత్రలు నిర్వహిస్తాం అని తెలిపారు.

ఒక్క రోజులో కొన్ని గంటలు పాటు జరిగే ఈ పాదయాత్రలో విజయవాడలో పవన్ కళ్యాణ్ కూడా నడవబోతున్నారు. ప్రజాకర్షణ కలిగిన సినిమా హీరో కాబట్టి ఆయనను చూడటానికి జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనితో భద్రతా ఏర్పాట్లు కూడా చాలా ముఖ్యం. ఈ పాదయాత్ర సక్సెస్ బట్టి జనసేన ప్రభావం అంచనా వెయ్యవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేని చోట్ల పార్టీని ఎలా సంఘటితం చేస్తారు అనేదే కీలకం.