Nagababu-Proving-to-be-A-Burden-to-Janasenaజనసేనకు మెగాబ్రదర్ నాగబాబు ఇబ్బందిగా పరిణమిస్తున్నారా అంటే ఆ పార్టీ సమర్ధకులు కూడా కాదు అనలేని పరిస్థితి. టీడీపీ మీద కోపమో లేక తన కుటుంబసభ్యుల మీద ప్రేమో తెలీదు గానీ ఆయన ప్రతీ చిన్నా విషయానికి ఫైర్ అవుతున్నారు. అయితే ఆ ఫైర్ వల్ల ఒక్కోసారి జనసేన కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది.

తాజాగా టీడీపీని సపోర్టు చేస్తున్నాయని అని చెప్పబడే రెండు ఛానళ్ళు చిరంజీవి అమరావతి పర్యటన సందర్భంగా రాజధాని రైతుల నిరసనను బాగా ఫోకస్ చేశాయి. దీనితో నాగబాబు మరోసారి టీడీపీ మీద, ఆ మీడియా మీదా విరుచుకుపడ్డారు. అయితే ఈ విమర్శ జనసేనకు చెడే గానీ మంచి చెయ్యదు అంటున్నారు చాలా మంది.

“టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని,టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం,మన వాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం ,మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం,మనబాబు కి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని,, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ,, బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ,బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే..శభాష్…(ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని doubt వస్తుందేంటి,” అంటూ ట్వీట్ చేశారు.

మీడియాని మంచి చేసుకోవడమో, మ్యానేజ్ చేసుకోవడమో చెయ్యాలి గానీ ఇలా గిల్లడం వల్ల జనసేనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీడియాలో వచ్చే కార్యక్రమాల ఖండనకు ఒక వ్యూహం ఉండాలి గానీ… వాటి మీద దుమ్మెత్తి పొయ్యడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు.

ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యలలో మరో ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే… ప్రతిపక్షంలో ఉండి ఎట్టి పరిస్థితులలోనూ అధికారంలో ఉన్న వారిని పొగడకూడదు. జగనే వీరికి కరెక్టు అని అంటే పవన్ కళ్యాణ్ వల్ల కాదు అన్నట్టే కదా? నాగబాబుకే తమ నాయకుడి మీద నమ్మకం లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం నమ్మకం ఏర్పడుతుంది?