Pawan- Kalyan Janasenaజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత మూడు నెలలలో మూడు నిరాహార దీక్ష ప్రకటనలు చేసారు. మొట్టమొదటి సారిగా మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావసభలో ఆయన ఆవేశంగా ప్రసంగిస్తూ ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా అని కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు.

అయితే ఏమైందో ఏమోగానీ తరువాతి కాలంలో ప్రత్యేక హోదా పక్కన పెట్టి రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. గత నెలలో గుంటూరులో అతిసార వ్యాధి ప్రభలినప్పుడు 48 గంటలలో ప్రభుత్వం బాధితులకు న్యాయం చెయ్యకపోతే నిరాహారదీక్షకు కూర్చుంటా అని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటనతో ప్రభుత్వం కలవరమేమి పడలేదు.

తాజాగా పలాసలో బుధవారం కిడ్నీ బాధితులతో ఆయన మాట్లాడారు. ఇందుకోసం 48 గంటలు ప్రభుత్వానికి గడువు విధించారు. ఆలోగా నిర్ణయాన్ని ప్రకటించకపోతే తన పర్యటనను ఒకరోజు ఆపి శ్రీకాకుళంలో నిరాహార దీక్ష చేపడతానని పవన్‌ హెచ్చరించారు. ఈసారైనా పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకుంటారేమో చూడాలి.