Pawan Kalyan- JanaSena Manifestoరాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన “భరత్ అనే నేను” సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన మహేష్ బాబు ద్వారా పలు కీలక అంశాలను దర్శకుడు కొరటాల శివ చెప్పించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా… ఒక్కో ఊరికి ఒక్కో ఇబ్బంది ఉంది, అన్నింటికీ కలిపి ఒక నిర్ణయాన్ని తీసుకోలేము… అంటూ మహేష్ ద్వారా ‘లోకల్ గవర్నెన్స్’ను తెరపైకి తీసుకువచ్చారు కొరటాల శివ.

‘లోకల్ గవర్నెన్స్’ అన్న పదం పక్కన పెడితే, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన మ్యానిఫెస్టోతో ప్రజల ముందుకు రాబోతున్నాడు. ఏపీలో ఉన్న 175 నియోజక వర్గాలకు ఒకే సమస్యలు లేవు, ప్రతి ఊరికి వేర్వేరు సమస్యలు ఉన్నాయి గనుక, రాష్ట్రం మొత్తానికి ఒకే మ్యానిఫెస్టో అంటే ఎలా? అంటూ 175 నియోజక వర్గాలకు 175 మ్యానిఫెస్టోలను తీసుకువస్తామని ప్రకటించారు.

జనసేనతో మార్పు మొదలయ్యింది, మొట్టమొదటి సారిగా ఎవరి మ్యానిఫెస్టో వారికే అంటూ పవన్ చేస్తోన్న ఈ ప్రయోగంపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఏదో కొత్తగా చేయడానికి మాత్రం పవన్ ప్రయత్నిస్తున్నాడన్న విషయం అర్ధమవుతోంది. అయితే ఆ 175 మ్యానిఫెస్టోలను చూస్తే గానీ చెప్పలేం, పవన్ ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేది? సినిమాలలో ఏదైనా సాధ్యమే… కానీ రీయల్ లైఫ్ లో అలా కాదు కదా..!?