ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ జనసేన పోరాటయాత్ర కొనసాగుతుంది. త్వరలో విడుదల చెయ్యబోయే జనసేన పార్టీ మేనిఫెస్టోలోని ఒక పాయింట్ ని పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత వైద్యం అందిస్తాం అని జనసేనాని ప్రకటించారు.
గతంలో విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే 1000 రూపాయిల మించి అయ్యే ప్రతి వైద్యం ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎటువంటి నింబంధనలు లేకుండా పూర్తిగా ఈ హామీలను అమలు చెయ్యడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆగష్టు 15 స్వతంత్ర దినోత్సవం సంధర్భంగా తమ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నట్టు జనసేనాని ప్రకటించారు.ఇంకా ఏమేమి అందులో ఉండబోతున్నాయి చూడాలి. మరోవైపు నిన్ననే ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ కళ్యాణ్ ఒక రోజు నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే.