Pawan Kalyan - Janasenaతెలుగుదేశం పార్టీపై మరియు నేతలపై విమర్శల వర్షం కురిపించినపుడు నవ్వుతూ చూసిన ‘వైసీపీ అండ్ కో’కు ప్రస్తుతం చుక్కలు చూపించే పనిలో జనసేన అధినేత ఉన్నట్లుగా కనపడుతోంది. విడతల వారీగా విమర్శల జోరు పెంచుకుంటూ వెళ్తోన్న పవన్ కళ్యాణ్ ను నిలువరించేందుకు ప్రస్తుతం జగన్ అండ్ కో సతమతమవుతోంది.

ఇన్నాళ్ళు తమతో కలిసి పోటీచేస్తారు, ఏదైనా అవసరమైతే జగన్ నే ముఖ్యమంత్రిని చేస్తారు అనుకుని తమ మీడియా వర్గాలైన సాక్షి అండ్ కోలలో పవన్ కు అనుకూలంగా కధనాలు ప్రసారం చేసాయి. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జగన్ మీడియా వ్యవహరించడం ఊహించని విషయమేమీ కాదు.

సిఎం చేస్తాడనుకుంటే, అసలు ముఖ్యమంత్రి పీఠానికే అర్హత లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేయడం వైసీపీ అండ్ కోకు ఏ మాత్రం మింగుడుపడని అంశంగా మారింది. నేరుగా జనసేన అధినేతపై జగన్ పెద్దగా విమర్శలు చేయకపోయినా, క్రింది క్యాడర్ తో పవన్ పై ఎదురుదాడిని ప్రారంభించి తమ మీడియా వర్గాలలో ప్రసారం చేసుకుంటున్నారు.