Pawan Kalyan - JanaSena-CPIMఈ ఎన్నికలలో జనసేన, బహుజన్ సమాజ్ వాది పార్టీ, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పొత్తుల విషయంలో జనసేనకు, సిపిఐ పార్టీల మధ్య ఇబ్బందులు వచ్చినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సిపిఐని అవమానించారని విజయవాడ సిపిఐ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్ది చలసాని అజయ్ కుమార్ విమర్శించారు. తమతో కనీసం మాట మాత్రం చెప్పకుండా, విజయవాడకు జనసేన అభ్యర్థిని ప్రకటించడం ఏమిటని ఆయన అన్నారు.

నూజివీడులో సిపిఐ అబ్యర్ది రంగంలొ ఉంటే జనసేన ఎలా అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ జనసేన అభ్యర్థిని ప్రకటించడం వెనుక ఏబై లక్షలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై రెండు రోజులలో వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. కాగా జనసేన తీరుపై సిపిఐ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పార్టీ నేతలతో దీనిపై చర్చలు జరుపుతున్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలని అనుకుంటున్నారు.

అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న అన్ని ఎన్నికల సభలలో వామపక్ష పార్టీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. పొత్తుల విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా పొత్తులో ముందుకే సాగాలని వామపక్షాలకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మినహా ఆ పార్టీలకు పెద్దగా వేరే ఆప్షన్లు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిపిఐ, సిపిఎంలకు జనసేన చేరి ఏడు శాసనసభ సీట్లు, రెండేసి ఎంపీ సీట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.