Pawan Kalyan  JanaSena - Communists seat sharing after sankranthiరానున్న ఎన్నికలలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే కీలక ప్రకటన చేశారు. “175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలతో తప్ప ఎవ్వరితోనూ కలిసి వెళ్లం. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి” అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనితో జనసేనను నమ్ముకుని నాలుగు సీట్లు తెచ్చుకుందాం అని చూస్తున్న వామపక్షాలకు ఊరట నిచ్చినట్టు అయ్యింది.

ఈరోజు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారని, తమ కూటమి ద్వారా ప్రత్యామ్నాయం తీసుకొస్తామని వివరించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయాలన్నదానిపై చర్చిస్తామని ప్రకటించారు. దీనితో జనసేనలో కోలాహలం మొదలయ్యింది. వామపక్షాలు తాము బలంగా ఉండే ఏజెన్సీ ప్రాంతాలలో సీట్లు అడిగే అవకాశం ఉంది. అయితే వారు గెలవగలిగే పరిస్థితి ఉందా అనేది చూడాలి.

దీనితో ఆ పార్టీలను వీలైనన్ని తక్కువ సీట్లకు పరిమితం చెయ్యాలి జనసేన. చివరి సారిగా 2009 ఎన్నికలలో వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో సీట్లు గెలిచాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన మొదటి ఎన్నికలలో అసెంబ్లీలో ఆ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పొత్తులు లేకుండా పోటీ చెయ్యడమే దీనికి కారణం. దీనితో ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ బలంతో చట్టసభలలోకి ఎంటర్ కావాలని ఆయా పార్టీలు తహతహలాడుతున్నాయి. చూడాలి అది సాధ్యమవుతుందో లేదో