Pawan Kalyan JanaSena - Chandrababu TDP Alliance!అధికార తెలుగుదేశం పార్టీ..పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీల మధ్య కొద్ది కాలం క్రితం పొత్తుకు సంభందించి చర్చలు జరిగాయని కొన్ని మీడియా వర్గాల సమాచారం. వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీలోని 175 సీట్లో పోటీచేసే ప్రసక్తేలేదని..కేవలం 35 నుంచి 40 సీట్లలోనే బరిలో నిలుస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి

ఇదే విషయం పవన్ కల్యాణ్ కూడా పలు సంధర్భాలలో చెప్తూ వచ్చారు. తమ బలం మేరకే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన చెప్తూ వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న వారిలో చాలా మందికి కోత పెట్టి ఆ సీట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన జనసేనకు సీట్లు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

40 కాకపోయినా కనీసం 30 నుంచి 35 సీట్లు అయినా చంద్రబాబు ఇస్తారనే అంచనాతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ తోడు ఉంటే బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లు తెదేపాకు గంపగుత్తుగా పడటం ఖాయం. పైగా ఆయనకు ఉన్న యువకుల ఫాలోయింగ్ అంత ఇంత కాదు.

కావున ఈ పొత్తు తెదేపాకు లాభమే. ఒకవేళ ఈ పొత్తు పొడిస్తే తెదేపా భాజపాతో తెగతెంపులు చెస్కోవచ్చు. ఆ పార్టీకి కేటాయించే 15-20 సీట్ల నుండే జనసేనకు సీట్లు కేటాయించొచ్చు. మరోవైపు అయితే తెలంగాణలో పోటీ పరిస్థితి ఏమిటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెబుతున్నారు.

ఐతే జనసేన పార్టీ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. పొత్తుల పై ఇప్పుడే ఎలాంటి నిర్ణయాలు జరగడం లేదని. పార్టీ ని పటిష్టపరిచే పనిలో ఉన్నట్టు, పొత్తుల విషయం 2019లో అప్పటి పరిస్థితుల బట్టి తమ అధినేత నిర్ణయిస్తారని వారు చెప్తున్నారు.