జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో తన జనసేన పోరాట యాత్రను పూర్తి చేసుకుని పశ్చిమ గోదావరిలోకి ప్రవేశించారు. ఉత్తరాంధ్రలో ఎన్నో బ్రేకులతో యాత్ర ఎలాగోలా పూర్తి చేసిన ఆయన, పశ్చిమకు వచ్చే సరికి మరింత నెమ్మదిగా మారిపోయారు. భీమవరంలో తిష్ట వేసి మాట్లాడితే హైదరాబాద్ వెళ్లిపోతున్నారు.
ఇదే కాకుండా పార్టీ పరిస్థితి గురించి కూడా జనసేన సమర్ధకులు విచారపడుతున్నారు. కింద నుండి పై వరకు పార్టీ కాపులతో నిండిపోతున్నారు. అసలు కాపులు తప్ప వేరే కులాల నాయకులు పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీనితో పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోయినా కుల ముద్ర పడిపోతుందని వారు భయపడుతున్నారు.
అదే జరిగితే మిగతా వర్గాలకు పార్టీ దూరమయ్యే అవకాశం ఉంది. అలా అని కాపు ఓట్లు పూర్తిగా జనసేనకే పడతాయా అంటే అదీ లేదు.. పడినా ఒక కులం ఓట్లతో పార్టీ గెలిచే అవకాశాలు చాలా అరుదు. దీనితో జనసేన అభిమానులు ఎంతగానో మధన పడుతున్నారు. చూడాలి రానున్న రోజులలో ఇది ఎటు దారి తీస్తుందో?