pawan-kalyan-janasena-alliance-bjpకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో జనసేన, బీజేపీ బృందం భేటీ అయింది. ఈ భేటీలో బీజేపీ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, డియోధర, పురందేశ్వరిలు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు.

అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైనా ఆర్థిక మంత్రితో మాట్లాడారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెదేపా హయాంలో కేంద్రం ఎలాంటి సహకారం అందించిందో ఇప్పుడూ అలానే అందిస్తోందని పవన్ చెప్పారు.

గతంలో కేంద్రం ఇచ్చే నిధులపై యూసీలు ఇవ్వకుండా టీడీపీ ఎలా వ్యవహరించిందో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తీరుతో వెళ్తోందని.. ఆ ప్రస్తావన వచ్చిందన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే…. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఒక నిజనిర్ధారణ కమిటీని వేసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు 74,542 కోట్ల మేర ఇవ్వాలని ఆ కమిటి నిర్ణయించింది.

ఆ విషయాన్నీ పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు ప్రస్తావించారు. ఇప్పుడు మాత్రం కొత్త స్నేహం కారణంగా కేంద్రం చాలా చేసేసింది అంటున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కాషాయవాదిగా మారిపోయి కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు వంటి వారిలా మాట్లాడటం గమనార్హం.