Pawan Kalyan janasena absence to all party meetజనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఆయనలోని నిలకడలేనితనం ఆయనను పార్టీని కూడా ఇబ్బందికి గురిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన నాటి నుండి పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూనే ఉన్నారు. మొదటిగా నారా లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేసి తరువాత మా దగ్గర ఆధారాలు ఏమీ లేవు, అందరు అనుకుంటున్నారు చూసుకోమని చెప్పా అంతే అనే దగ్గరనుండి మొదలు అయ్యాయి.

తరువాత అవిశ్వాసతీర్మాణం పెడితే దేశమంతా తిరిగి జాతీయ పార్టీలతో మాట్లాడి మద్దత్తు కూడగడతా అని చెప్పి అవిశ్వాసం పెట్టాక దాని వల్ల ఉపయోగం లేదని తప్పించుకున్నారు. తెలంగాణ పోరాటం మాదిరిగా అన్ని పార్టీలు కలిసి స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చెయ్యాలని, అఖిలపక్షం పెట్టి జేఏసీ లాంటిది పెట్టాలని కోరిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అఖిలపక్షం పెడితే దాని వల్ల ఉపయోగం లేదని జనసేన హాజరు అవ్వకుండా డుమ్మా కొట్టింది.

ఇలా చెప్పిన మాట మళ్ళీ చెప్పకుండా ఉంటే జనసేనకు విశ్వసనీయత లేకుండా పోతుంది. అది ఆయన రాజకీయ మనుగడకే ప్రమాదం అని తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ కే మంచిది. జనసేనతో పాటు బీజేపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ కూడా అఖిలపక్షాన్ని బహిష్కరించాయి.