Pawan Kalyan Jana Sena Targets TDPచంద్రబాబు నాయుడే టార్గెట్ గా పనిచేస్తోన్న జనసేన అధినేత నోట ఆదివారం నాడు పలు కీలక విషయాలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉంటే, రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చారని, అయితే ఆ మరుసటి రోజే రెండు పేపర్లకు లీకులు ఇచ్చారని, దీంతో చంద్రబాబుపై నమ్మకం ఆ రోజే పోయిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీని కలిసానని స్వయంగా పవన్ చెప్పడంతో మొత్తం స్కెచ్ అంతా ప్రజలకు స్పష్టమవుతోంది.

నాలుగేళ్ల క్రితమే చంద్రబాబుపై పవన్ కు నమ్మకం పోతే, మరి ఈ నాలుగేళ్ళు ఏం చేస్తున్నట్లు? బిజెపి మోసం చేస్తుంటే టిడిపి నాలుగేళ్ళు ఏం చేసిందని ప్రశ్నిస్తున్న పవన్, మరి ఈ నాలుగేళ్ళు టిడిపి మోసం చేస్తుంటే ఏం చేసారో సెలవిస్తే బాగుండేది. ఇందులో మరో విషయం ఏమిటంటే… ముందే పేపర్లో సమాచారం వచ్చిందని పవన్ కు నమ్మకం పోయింది, ఒకవేళ ఆ అంశం పేపర్లో రాని పక్షంలో… రాజ్యసభ సీటును తీసుకునేవారా? రోజురోజుకు పవన్ స్పీచ్ లు మరింత కామెడీగా మారిపోతున్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే!