జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం నుంచి చేస్తున్న ‘జనసేన పోరాట యాత్ర’ 2019లో తమ గెలుపుకు నాంది అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ అన్నారు. ఇచ్చాపురంలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ముఖ్యంగా యువత హాజరు అయిందని ఆయన అన్నారు.
ఈ పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, జనసేనకు మధ్య పోటీ ఉండవచ్చని, తెలుగుదేశం పార్టీ మూడోస్థానానికే పరిమితం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో పోటీ జగన్ కు,పవన్ కే ఉంటుందని ఆయన అన్నారు. 175 నియోజకవర్గాలలో జనసేన పోటీచేస్తుందని ఆయన అన్నారు. లోకేష్ పై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు సంబందించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.
అయితే మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభ నాటి మొదలు ఆరోపణలు చెయ్యడం, ఆధారాలు ఉన్నాయి అంటారు కానీ బయటపెట్టరు. ఇటువంటి ఆరోపణలే ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద చేసి ఇలాగే ఆధారాలు ఉన్నాయి సరైన సమయంలో బయటపెడతాం అని తప్పించుకుంటే పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో కదా?
TFI Supporters Of Jagan: Risked Careers, Got Cheated
ABN RK: Will MNCs Sign MOUs With CM On Bail?