pawan-kalyan-jana-sena-official-youtube-channelఎవరు ఎలాంటి విమర్శలు చేసినా… ఎవరు ఎన్ని ప్రశంసలు కురిపించినా… తానూ అనుకున్నది చేసుకుంటూ పోతున్న ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తాజాగా ‘జనసేన పార్టీ అఫిషియల్’ యూ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం రాజకీయ ప్రచారం సోషల్ మీడియా వేదికగా కూడా జరుగుతుండడంతో, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రమ్ తదితర సోషల్ మీడియాలో ఖాతాలను ఓపెన్ చేసిన ‘జనసేన,’ యూ ట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించింది.

బహుశా ఈ ఛానల్ ద్వారా తన ‘జనసేన’ పార్టీ కార్యకలాపాలను, ఉద్దేశాలను, సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్, ప్రజలకు తెలియచెప్పాలని భావిస్తున్నారేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే మరో వైపు దీనిపై సెటైర్లు కూడా పడుతున్నాయి. ఇప్పటివరకు రాజకీయ అంశాలపై ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టి సరిపెట్టే వారని, ఇప్పుడు ఓ వీడియోతో సరిపెడతారేమో అంటూ నెటిజన్లు వేస్తున్న కౌంటర్లు కోకొల్లలు.

అయితే ఏది ఏమైనా… ఓ పక్కన సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నా… జనసేనను పవన్ విడిచిపెట్టకపోవడం అనేది, రాజకీయాలపై తన సీరియస్ నెస్ ను, చిత్తశుద్దిని చాటుతోందని పవర్ స్టార్ ఫ్యాన్స్ చెప్తున్న మాట. ఓ 11 సెకన్ల వీడియోతో ‘జనసేన’ను ప్రారంభించినప్పటికీ, మొదటి వీడియోలో పవన్ ఏం చెప్పబోతున్నారో చూడాలి.