Please-Be-Responsible,-Pawan-Kalyan!చంద్రబాబుతో కలిసే అవకాశం అవసరం తమకు లేదని…. తమకు కొత్త మిత్రుడిగా పవన్ కళ్యాణ్ దొరికాడని సిపిఐ నారాయణ చెప్పుకొచ్చారు. మోడీని ఓడిద్దాం దేశాన్ని రక్షిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుదాం అనే నినాదంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తాము కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని నారాయణ వివరించారు.

పవన్ కళ్యాణ్ వామపక్షాలు కలిసి ఇటీవలే కొన్ని కార్యక్రమాలు చేసారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం విడిగా జనసేన పోరాట యాత్ర చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికలలో విడిగా పోటీచేస్తాం అని చెప్పినా పొత్తు పెట్టుకుని కనీసం 4-5 స్థానాల్లో గెలవాలని వామపక్షాల ఆలోచనగా కనిపిస్తుంది.

అయితే పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పనిచేయడానికి ఓకే అనిపించినా సీట్ల సర్దుబాటు చేసుకుంటే నష్టపోతాం అని భావిస్తున్నట్టుగా సమాచారం. దీనితో తరువాతి కాలంలో ఈ బంధం ఏమవుతుందో చూడాలి. 2014లో వామపక్షాలు విడిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి.