Pawan Kalyan Jana Sena Coordinators selectionతెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పార్లమెంటు స్థానానికి 20 మంది చొప్పున 42 స్థానాలకు 840 మంది సమన్వయకర్తలను నియమించేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. ఔత్సాహిక శిబిరాలకు హాజరైన వారి నుంచి సమన్వయకర్తలను ఎంపిక చేస్తారు. అయితే ఈ వ్యూహం వాళ్ళ పార్టీ కి ఎలాంటి ఉపయోగం లేకపోగా నష్టం జరగొచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సహజంగా సమన్వయకర్తలే ఆ పార్టీ తరపున అభ్యర్థులు అవుతారు. కాబట్టి ఒక్కో స్థానానికి ఒకరినే నియమిస్తారు. గతంలో ఇద్దరినీ నియమించి ఒకరికి సీట్ ఇష్టం అని పార్టీలు చెప్పిన సందర్భంలో సమన్వయలోపం మరియు వర్గ పోరు వల్ల మొత్తానికి అలంటి చోట్లా పార్టీ నష్టపోయేది.

ఒకవేళ సమన్వయంతో పని చేసిన చివరిలో టికెట్ దక్కని వాళ్ళు దక్కిన వారికి వ్యతిరేకంగా పని చేసి పార్టీ కి నష్టం చేసేవారు. ఒక్కోస్థానానికి 20 మంది సమన్వయకర్తలు అంటే పరిస్థితి ఎలా ఉండబోతుందో మనమే ఊహించుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ దీని పై పునరాలోచిస్తే ఆ పార్టీ కే మంచిది.

ఈ నెల 6 నుంచి ఎంపిక సమావేశాలు జరుగుతాయి. పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, తెలంగాణ బాధ్యుడు శంకర్‌గౌడ్‌, మీడియా బాధ్యుడు హరిప్రసాద్‌, రియాజ్‌, నగేష్‌ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తొలివిడతలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించాయి.