Pawan-Kalyan-Trying-To-Divert-Attention-from-No-Confidence-Motionరాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపై మాట్లాడాల్సి వచ్చిన సమయాలలో… మీడియా కంట పడకుండా జాగ్రత్త పడడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే… అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా విమర్శించాల్సి వచ్చిన సమయాలలో కెమెరా కన్నుకు కనపడకుండా పవన్ కళ్యాణ్ పలు జాగ్రత్తలు తీసుకుంటూ కేవలం ట్విట్టర్ కే పరిమితమవుతున్నారు.

తాజాగా దేశాన్ని కుదిపేస్తోన్న అవిశ్వాసంపై పెదవి విప్పేందుకు ఏ మాత్రం సాహాసించని పవన్ కళ్యాణ్, ట్విట్టర్ లో మాత్రం ఇందుకు కారణం తెలుగుదేశం ప్రభుత్వమే అన్న భావన వచ్చే విధంగా ట్వీట్లు చేసి చేతులు దులుపుకున్నారు. ఓ పక్కన అవిశ్వాసంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని ట్వీట్లు చేయడం పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణికి అద్దం పడుతోంది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… మరోసారి మ్యాటర్ ను డైవర్ట్ చేయడానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారని చెప్పాలి. బిజెపి చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ అని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ వర్గీయులు చేస్తోన్న ఆరోపణలకు ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తునాయి. రాష్ట్రానికి పవన్ చేస్తోన్న ద్రోహం కంటే కూడా, తన గోయ్యిని తానే తీసుకుంటున్నారన్న విషయం పవన్ ఎప్పుడు గుర్తిస్తారో? అసలు ఆ ఆలోచన వస్తుందంటారా?!