Social media satire on pawan kalyanరంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఒక వారం ముందే పోరాటయాత్రకు బ్రేక్ ఇచ్చిన జనసేన అధినేత ఎప్పుడు బరిలోకి దిగుతారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రంజాన్ వెళ్ళిపోయి మూడు, నాలుగు రోజులు గడుస్తున్నా, ఎలాంటి ప్రకటన రాకపోవడంతో, నిరాశలో ఉన్న జనసైనికులకు తాజాగా ఓ సమాచారం లభించింది. ఈ నెల 26వ తేదీ నుండి మలి యాత్ర షెడ్యూల్ కు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 24వ తేదీన పవన్ తన కంటికి శస్త్ర చికిత్స చేయించాలని భావించినప్పటికీ, తాజాగా డాక్టర్లు దీనిని వాయిదా వేసారని జనసేన విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. దీంతో 26వ తేదీన విశాఖ జిల్లాలో మూడు, నాలుగు రోజుల పాటు యాత్ర కొనసాగనుందని, ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం అవుతుందని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేయడంలో పార్టీ నేతలు నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

దాదాపుగా రెండు వారాల పైనే విశ్రాంతి తీసుకోనున్న పవన్, ఈ యాత్రలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తారో చూడాలి. ఎందుకంటే బ్రేక్ కు ముందు తెలుగుదేశం పార్టీపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలలో, తన అవగాహనా రాహిత్యం బట్టబయలు కావడంతో రాజకీయంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ సారైనా సరైన అస్త్రాలను సిద్ధం చేసుకుని వస్తున్నారా? లేక సింగిల్ ఎజెండా ‘టార్గెట్ టిడిపి’ అంటూ బరిలోకి దిగుతారో చూడాలి.