Pawan Kalyan JAGANజనసేన అధినేత 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుండీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగానే ఉన్నారు. జగన్ కూడా 2019 ఎన్నికలకు ముందు పవన్ ని చాలా అవహేళనగా మాట్లాడేవారు. పవన్ ని కనీసం రాజకీయ నాయకుడిగా గుర్తించకుండా యాక్టర్ అని సంభోదించే వారు.

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ వ్యక్తిగత విమర్శలు కూడా చేసే వారు. మరోవైపు పవన్ కూడా జగన్ ని జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ ఉంటారు. అయితే మెగా ఫ్యామిలీ లో మిగతా వారు సినిమాల పేరుతో జగన్ ని పొగడ్తలతో ముంచెత్తడం పవన్ కు ఈ మధ్య ఇబ్బందికరంగా మారుతుంది.

నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అతీగతీ లేని రీస్టార్ట్ ప్యాకేజీ ని చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ అంతాఇంతా కాదు అంటూ పొగిడేశారు. ఈరోజు జగన్ పుట్టినరోజు సంధర్భంగా చిరంజీవి ట్విట్టర్ లో జగన్ ని విష్ చేశారు. విష్ చేస్తే పర్లేదు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.

సొంత కుటుంబసభ్యులు చూడగలిగిన జగన్ గొప్పతనాన్ని పవన్ చూడలేకపోతున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు జనసేనను ఎత్తిపొడుస్తున్నారు. సొంత కుటుంబసభ్యులు ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగిడేస్తే ఇక ప్రజలని ప్రభుత్వానికి ఎలా వ్యతిరేకంగా సమాయత్తం చేస్తారు అని ప్రశ్న రాకమానదు. ఈ విషయంగా పవన్ ఏమనుకుంటున్నాడో గానీ జనసైనికులు మాత్రం ఎంతో మదన పడుతున్నారు.