Pawan Kalyan indirectly supports amit shahగతవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ కలకలం సృష్టించింది. చంద్రబాబుకు అమిత్ షా రాసిన లేఖ ను,ఆ తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూస్తే ,రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని అర్ధం అవుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

వేలాది కోట్లు ఇచ్చినా ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అమిత్‌ షా అంటున్నారు. ఎప్పటిలాగే రాష్ట్రానికి భాజపా అన్యాయం చేసిందని సీఎం మరోసారి అంటున్నారు. ఖర్చులపై కేంద్ర రాష్ట్ర అధికారుల కమిటీ వేసి ప్రజలకు లెక్కలు తెలియజేయవచ్చుగా అని పవన్‌ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ పరిణామాలపై చర్చించడానికి వామపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసారు పవన్ కళ్యాణ్.

ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం వేరేగా ఉన్నవి. అమిత్ షా లేఖను సీరియస్ గా తీసుకోనక్కరలేదు, ఎందుకంటే అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు, భారత ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తి అని పవన్ కళ్యాణ్ అన్నారు. సీరియస్ గా తీసుకొనవసరం లేకపోతే ఆ లేఖ బట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం, కేంద్ర రాష్ట్ర అధికారులతో కమిటి వెయ్యాలని పవన్ కళ్యాణ్ ఎందుకు డిమాండ్ చేసినట్టు?