Pawan Kalyan కమ్యూనిస్టు భావజాలం తనది అని ఎప్పటి నుండో చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో బీజేపీతో జతకట్టి మాతరాజకీయాలు చేస్తున్నారు. ఫక్తు హిందుత్వ వాదిగా తనని తాను చూపించుకోవడానికి దీక్షలు, ఉపవాసాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ విషయంగా పవన్ కళ్యాణ్ అనవసర రిస్కు తీసుకుంటున్నారు అని అంటున్నారు.

“బీజేపీ, జనసేన ఎంత ప్రయత్నించినా 2024లో ప్రభావం చూపించలేవు. ఆ సమయానికి కేంద్రంలో బీజేపీ ప్రజావ్యతిరేకత ఎదురుకుని… అధికారంలోకి తిరిగి రావడానికి మిత్రుల సహకారం కావాల్సి వస్తే మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ లేదా టీడీపీ పంచన చేరవచ్చు. అయితే బీజేపీని నమ్ముకుని మత రాజకీయాలు చెయ్యడం వల్ల జనసేన మైనారిటీ ఓట్లు కోల్పోతుంది,” అని విశ్లేషకులు అంటున్నారు.

“బీజేపీతో గానీ ఏ పార్టీతో గానీ పొత్తు పెట్టుకున్నా జనసేన తన స్వరూపం కోల్పోకూడదు. పొత్తుల కోసం ఏ పార్టీ కూడా తన ఐడియాలజీని మార్చుకోకూడదు. అదే గనుక చేస్తే మొదటికే మోసం వస్తుంది. సరిగ్గా జనసేన విషయంలో కూడా జరుగుతుంది అదే. పవన్ కళ్యాణ్ ఈ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది,” అని వారు వారిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… క్షేత స్థాయిలో జరుగుతున్న పోరాటాలు అన్నీ బీజేపీ నాయకత్వంలో జరుగుతున్నాయి. జనసేన ప్రాబల్యం కనిపించడం లేదు. అసలైతే ఈ పొత్తులో కీలక పార్టీ కలిగింది జనసేననే. జనసేన ఎజెండా సెట్ చేస్తే… బీజేపీ ఫాలో అవ్వాలి అయితే ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా రివర్స్ లో జరుగుతుంది.