సినిమాలలో హీరో హీరోయిన్లను ఎత్తుకోవడం సర్వసాధారణమైన విషయం. కానీ పవర్ స్టార్ మాత్రం తన తాజా సినిమాలో అందుకు ‘నో’ చెప్పేసాడు. ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ లో భాగంగా… ఓ సన్నివేశంలో హీరోయిన్ శృతిహాసన్ ను ఎత్తుకుని హాస్పిటల్ కు వెళ్ళాల్సి ఉందట. ఈ సీన్ డైరెక్టర్ చెప్పిన తర్వాత, పవన్ చేయనని ఖచ్చితంగా చెప్పేసాడంట. అయితే ఎందుకు చేయనన్నారో కూడా ఓ స్పష్టమైన క్లారిటీతో పవన్ చెప్పిన తర్వాత చిత్ర యూనిట్ కూడా ‘ఓకే’ అనక తప్పలేదని సినీ జనాల సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా బ్యాక్ పెయిన్ తో ఇబ్బందులు పడుతున్న విషయం బహిరంగమే. ఎట్టి పరిస్థితుల్లోనూ బరువులు ఎత్తే కార్యక్రమాలు గానీ, రిస్కీ షాట్స్ గానీ చేయవద్దని డాక్టర్లు సూచించడంతో… హీరోయిన్ శృతిహాసన్ ను ఎత్తుకుని వెళ్ళే సీన్ కు ‘నో’ చెప్పారని తెలుస్తోంది. ఇదే విషయం దర్శకుడు డాలీకి కూడా చెప్పడంతో, అందుకు అనుగుణంగా ఈ సీన్ లో మార్పులు చేసి షూటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ‘బ్యాక్ పెయిన్’ పవన్ ను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తోందో ఈ తాజా ఉదంతం చెప్పకనే చెప్తోంది.