pawan kalyan has to take decision on his birthdayచాలా మంది తమ తమ పుట్టినరోజులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని గట్టిగా పాటించడానికి ప్రయత్నిస్తారు. ఆ నిర్ణయాలు తమ జీవిత గమనాన్ని మార్చేలా ఉండేలా కూడా చూసుకుంటారు.

అయితే ఇలా పుట్టినరోజులకు స్పెషల్ నిర్ణయాలు తీసుకునే అలవాటు అందరికీ ఉండదు. పవన్ కళ్యాణ్ కు అటువంటి అలవాటు ఉందో లేదో తెలీదుగానీ లేకపోయినా ఈ పుట్టినరోజున అయన ఒక నిర్ణయం తీసుకోవాలి.

2019 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత అయిదేళ్ల సమయంలో సగం అయిపోయింది. జనసేన 2019లో ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోయింది. పార్టీ నిర్మాణం విషయంలో ఒక్క ముందడుగు కూడా పడలేదు.

ఆ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తనకు ఏమీ పెట్టదు అన్నట్టు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చివరి సరిగా ఆయన తిరుపతి ఎన్నికల ప్రచారంలోనే సీరియస్ రాజకీయ నాయకుడిగా కనిపించారు.

ఆ తరువాత ఎప్పుడో ఒక్కో సారి హాజరు వేయించుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కాకుండా పార్టీని నడిపించే ఇంకో నాయకుడు ఎలానూ లేరు. ఇదే కొనసాగితే 2019 కంటే దారుణమైన ఫలితాలు తప్పవు. ఈరోజు ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ ను ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు.

ఒకప్పుడు ఇటువంటి విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పే జనసైనికులు కూడా దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే అభిమానులలో కూడా ఒకరకమైన నిస్సత్తువ ఆవహించింది అని అర్ధం అవుతుంది. ఇది చాల ప్రమాదకరం అనే చెప్పుకోవాలి.

ఈ పుట్టినరోజు నాడైనా సినిమాలు తగ్గించుకుని రాజకీయాలకు ఎక్కువ టైమ్ కేటాయించకపోతే ఘోర పరాజయం తప్పదు. ఆ ప్రకారం ఒక నిర్ణయం పుట్టినరోజు నాడు తీసుకుని పవన్ కళ్యాణ్ గట్టిగా కష్టపడాలి.