Pawan-kalyan-Haritha-Haramహరితహారంలో భాగంగా ప్రస్తుతం టాలీవుడ్ బడా సెలబ్రిటీలు అంతా మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగితేలుతున్నారు. సోమవారం నాడు ప్రిన్స్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగా, మంగళవారం నాడు మెగాస్టార్ చిరంజీవి ‘హరితహారం’ను పూర్తి చేసి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాల్సిందిగా ఛాలెంజ్ చేసారు.

అన్న ఇచ్చిన కార్యానికి తమ్ముడు ఒక్క పూటలోనే రిప్లై ఇవ్వడం విశేషం. మెగాస్టార్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన జనసేన అధినేత, మాదాపూర్ లో ఉన్న తన పార్టీ ఆఫీస్ లో మొక్కలు నాటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత త్వరగా పవన్ ఛాలెంజ్ ను స్వీకరించడం అనేది తన అన్న మీద ప్రేమను చాటుకోవడానికేనా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.