Pawan Kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా ట్విట్టర్ లో చేస్తున్న హంగామా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు ఆవేశపరుడిగా పేరు పొందిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాస్త నెమ్మదస్తుడిగా మారి పరిణితి చెందిన రాజకీయనాయుడిగా తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాలు చేశారు.

అయితే కోపం వస్తే ఆయన అన్ని మర్చిపోయి ఊగిపోతారు అనేది మొదటి నుండి తెలిసిందే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏకంగా ఆయన మీడియా మీదే యుద్ధం ప్రకటించేశారు. టీవీ9 మీద ఆంధ్రజ్యోతి మీద విరుచుకుపడుతున్నారు. ఏవేవో ఆధారాలు ఉన్నాయి అంటూ ఆరోపణలు చేసి తీరా చూస్తే అవి ఏవి అంతగా ఉపయోగపడేవిగా లేవు.

టీవీ9 వీడియోని మార్ఫింగ్ చేసారు అనే ఆరోపణలు కూడా ఎదురుకుంటున్నారు కూడా. దీని వాళ్ళ ప్రజలు మళ్ళీ ఆయనను ఆవేశపరుడిగా చూడటం మొదలుపెడతారు. అదీగాక తెలుగు రాజకీయాలలో కీలక ఛానెల్స్ ఐన టీవీ9, ఆంధ్రజ్యోతితో విరోధం అంటే జనసేనకు ఇబ్బందే. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే జనసేన బహుశా ఆ టీవీ చర్చల్లో కూడా పాల్గొనలేదు.

ఈ ఛానెల్స్ పై పవన్ కళ్యాణ్ కు ప్రజలకు ఎలాంటి ఉద్దేశం ఉన్నా అవి రాజకీయాలలో కీలకం. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ఇవిగాక పరువునష్టం దావాలు ఉండనే ఉన్నాయి. సాక్షి రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సపోర్టు చెయ్యొచ్చుగాక వైకాపా జనసేనకు పొత్తు ఉంటే తప్ప ఎన్నికల దగ్గర పడ్డాక సాయం చెయ్యదు. పవన్ కళ్యాణ్ కు జరిగింది బాధాకరమే కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు కర్రా విరగకుండా పాము చావకుండా వ్యవహరించాలి.