Pawan Kalyan Following Amitabh Bachchan in twitter2014లో ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖాతాలో ఇప్పటివరకు దాదాపుగా 3.2 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. పవన్ ను ఇంతమంది ఫాలో అవుతున్నారు గానీ, గత నాలుగేళ్ళుగా సోషల్ మీడియాలో ఉంటున్న పవన్ ఏ ఒక్కరిని కూడా ఫాలో కావడం లేదు. కానీ హఠాత్తుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను ఫాలో కావడం ప్రాధాన్యతను దక్కించుకుంది.

ఎన్నాళ్ళ నుండో ట్విట్టర్ లో ఉన్న అమితాబ్ ను ఒక్కసారిగా ఫాలో కావడం కావడం వెనుక ఒక మినీ ఎపిసోడ్ నడిచింది. ఆర్మీకి సంబంధించిన కొందరు ప్రముఖులు చేసిన గొప్ప మాటలను పవన్ క్వోట్ చేస్తూ ఇటీవల ఓ ట్వీట్ చేసారు. అద్భుతంగా ఉన్న క్వోట్స్ కు బిగ్ బీ నుండి స్పందన వచ్చింది. పవన్ చేసిన ఈ షేరింగ్ కు బిగ్ బీ లైక్ కొట్టడం విశేషం.

బిగ్ బీ అంతటి వ్యక్తి లైక్ కొడితే బాగోదని భావించారో ఏమో గానీ, అమితాబ్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఓ సందేశం వినిపించారు. అంతేకాదు వెనువెంటనే అమితాబ్ లో ఫాలో అయిపోయారు పవన్. బహుశా తను చేసిన ట్వీట్ కు అమితాబ్ ఎలాంటి స్పందన ఇవ్వకుంటే, అమితాబ్ ను ఫాలో అయ్యేవారా? అన్నది నెటిజన్ల ప్రశ్న! ఇందులో పవన్ నిజాయితీ ఎక్కడుంది? మరో ప్రశ్న!