పవన్ ఫ్యాన్స్… ఇదేమి గోల గురూ..!

Pawan Kalyan Fans irritating renu desai పవన్ పేరెత్తితే చాలు… అది పాజిటివ్ విషయమా? నెగటివ్ అంశమా? అని సోషల్ మీడియాలో అభిమానులు కాచుకుని కూర్చున్నట్లుగా కనపడుతోంది. ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడదామా… అన్న చందంగా మారిన పరిస్థితులలోకి ప్రస్తుతం పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ వచ్చి చేరింది. ఒంటరి జీవితం ఎలా ఉంటుందో అన్న విషయమై, తన భావాలను వ్యక్తపరిచిన రేణుకు పవన్ ఫ్యాన్స్ నుండి తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి.

“మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ… మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చ‌చ్చినంత ఒట్టు… మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌర‌వం త‌గ్గిపోతుంది… ప‌వ‌న్ కల్యాణ్ ని అన్న అని పిలుస్తాం, నిన్ను వ‌దిన అంటాం… మీ నిర్ణ‌యంతో అంద‌రూ బాధప‌డే అవ‌కాశం ఉంది…” అంటూ ఒకటేమిటి రకరకాలుగా ఫేస్‌ బుక్‌ వేదికగా ప‌వ‌న్ మాజీ సతీమణి రేణుకు ఉచిత సలహాలతో కూడిన హెచ్చరికలు చేస్తూ హంగామా చేస్తున్నారు.

తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణు చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఆమె వ్య‌క్తిగ‌త విష‌యంలో క‌ల‌గజేసుకుని చేస్తున్న కామెంట్లు ఇవి. దీంతో ఆగ్రహించిన రేణూ దేశాయ్‌… ఈ కామెంట్లు కేవలం త‌న‌ను ఉద్దేశించిన‌వేన‌ని తాను అనుకోవడం లేదని, అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామ‌ని అదే ఫేస్ బుక్ వేదికగా మండిపడ్డారు.

“ఎలాంటి ఆలోచనలు ఉన్న మగాళ్ల మధ్య బతుకుతున్నాం?’ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన రేణు, ఒక వైపు మహిళల‌ సమానత, సాధికార‌త, అత్యాచారాల నుంచి మహిళలకు రక్షణ వంటి అంశాల‌పై ప్ర‌సంగాలు చేస్తూనే… మ‌గ‌వారు మ‌రోవైపు ఇలాంటి కామెంట్లు చేస్తున్నార‌ని చెప్పింది. తాను ఏడేళ్లు ఒంటరిగా ఉండి, ఇప్పుడు త‌న‌కు ఒక జీవితభాగస్వామి ఉంటే బాగుండునని అనిపించిందని చెప్పాన‌ని తెలిపింది.

ఒక అమ్మాయి మ‌రో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పేనా? తాను జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఒంటరిగా బతకాలా? అని ప్ర‌శ్నించింది. అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే, మహిళలు వారి కుమారుల‌ను పద్ధతిగా పెంచాలని తాను ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాన‌ని ఈ సందర్భంగా తెలిపింది. పర్సనల్, పబ్లిక్ అన్న తేడా లేకుండా ప్రతి అంశంలోనూ రచ్చ చేస్తున్న పవన్ అభిమానుల తీరు అనేక శేషప్రశ్నలను మిగులుస్తోంది.



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

రాజు గారికి మరీ ఎటకారం ఎక్కువండి!Don't Missశోభనం టాక్స్... ఏం ఎటకారం గురూ..!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 'వైఎస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్' 5%పై సోషల్ మీడియాలో పెద్ద...Jr NTR Bheem - RRR MovieDon't Missఆర్ఆర్ఆర్... ఫోటోషాప్ పోస్టరా..?రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్"కు సంబంధించి రెండు పోస్టర్లను సోమవారం నాడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తొలుత జూనియర్ ఎన్టీఆర్,...పుష్ప... 'ఫైర్' అనుకొంటివా... 'ఫ్లవర్..!'Don't Missపుష్ప ట్రైలర్... 'కంటెంట్'లో కన్ఫ్యూషన్..!'ఆర్య, ఆర్య 2' తర్వాత సుకుమార్ - అల్లు అర్జున్ కాంభినేషన్ లో వస్తోన్న "పుష్ప" సినిమాపై సినీ పరిశ్రమలో...Akhanda in Mass theatresDon't Miss'కడప'లో కూడా 'కమ్మ' వాళ్ళే కొంటున్నారా?ఏదైనా ఒక మంచి జరిగినపుడు దానిని ఆహ్వానించాలి గానీ, బురద జల్లే ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుతం "అఖండ" సినిమాపై ఓ...'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?Don't Miss'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న "అఖండ" సినిమాకు కులం ఆపాదించే పనిలో ఓ వర్గం తలమునకలై ఉన్నట్లుగా కనపడుతోంది. 'అఖండ'కు...

Mirchi9