kamaal khan tweet on pawan kalyanట్విట్టర్ వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బాలీవుడ్ ప్రముఖుడు కమల్ ఖాన్ చేసిన వ్యాఖ్యల దుమారం తెలియనిది కాదు. అయితే ఈ స్థాయి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కమల్ ఖాన్ పై యువహీరో నిఖిల్ అదే ట్విట్టర్ లో మండిపడ్డారు. దీంతో కమల్ చూపులు పవన్ నుండి నిఖిల్ వైపుకు మళ్ళాయి. పవన్ నే ఒక రేంజ్ లో వేసుకున్న కమల్ ఖాన్, ఇక నిఖిల్ ను ఏ రేంజ్ లో వేసుకుని ఉంటాడా… అన్న ఆలోచన రావడం ఎంత సహజమో… అందుకు అనుగుణంగానే కమల్ తనదైన వ్యాఖ్యలతో చెలరేగడం కూడా అంతే వాస్తవం.

“నిఖిల్… నువ్వు కూడా ఒక నటుడివేనా…. అమ్మ దేవుడో… నీ లాంటి కోతి ముఖం ఉన్న హీరోను చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారో అర్ధం కావడం లేదు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అంటూ కమల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే కమల్ వ్యవహార తీరు పరిశీలిస్తున్న వారు మాత్రం ‘కొంచెం తేడానే’ అంటున్నారు.

పవన్ అంతటి స్థాయి వ్యక్తి పైన కమల్ ఎన్నైనా విమర్శలు చేయవచ్చు, అదే తన పైన మరొకరు విమర్శ చేస్తే మాత్రం ఇసుమంత కూడా తట్టుకోలేకపోతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జరిగిన పరిస్థితులు… జరుగుతున్న పర్యవసానాలు పరిశీలిస్తే… ఆ విశ్లేషణలు కాదనలేం మరి!

pawan-kalyan-effect-on-hero-nikhil-kamaal-khan-tweet-on-nikhil