Pawan Kalyan speech at Divi's Laboratories victimsజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల్లోకి వచ్చిన ఆయనకు అనూహ్య స్పందన వస్తుంది. జనం రోడ్ల మీద కిక్కరిసి వచ్చి ఆయన కదలడానికి కూడా లేకుండా చేసిన సందర్భాలు ఎన్నో. అయితే అటువంటి ఆయన పోయిన ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేస్తే అనూహ్యంగా రెండు చోట్లా ఓడిపోయారు.

అయితే ఈ విషయంలో తన అసంతృప్తిని పలుమార్లు భయపటపెడుతూనే ఉన్నారు పవన్. నా సభలకు తండోపతండాలుగా వస్తారు… నన్ను సమస్యలపై పోరాడమంటారు… మేము కూడా మీకోసం నిలబడతాం… కానీ ఓట్లు మాత్రం జగన్ పార్టీకి వేస్తారు అంటూ జనసేనాని పలుమార్లు వాపోయారు. నిన్న దివీస్ పై తూర్పు గోదావరి వచ్చిన ఆయన ఇటువంటి వ్యాఖ్యలే మళ్ళీ చేశారు.

దాన్నిబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా తన ఓటమి షాక్ నుండి బయటపడలేదు అనే చెప్పుకోవాలి. రెండు చోట్లా ఓడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ చెబుతున్న ఈ పరిస్థితి కమ్యూనిస్టులకు కూడా వర్తిస్తుంది. సహజంగా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన ముందు ఎర్ర జండాల వైపే చూస్తారు ప్రజలు… అయితే వారిని ఎన్నికలలో మాత్రం గెలిపించరు.

అటువంటి పరిస్థితి రాకుండా పవన్ తమ పార్టీని బలోపేతం చెయ్యరు. ఎన్నికలలో గెలిచే పార్టీ అనిపించుకోకపోతే కమ్యూనిస్టుల పరిస్థితే జనసేనకు కూడా వస్తుంది. గెలిచే అవకాశం ఉన్న పార్టీలకే జనాలు ఓట్లు వేస్తారు. ఓడిపోయే పార్టీలకు వేసి ఓట్లు వేస్ట్ చేసుకోరు. కావున జనసేన గెలిచే గుర్రం అని పవన్ ప్రజలలో అభిప్రాయం కలిగించాలి.