pawan-kalyan-demanded-50-seats-for-janasena-with-tdp-allianceజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది మార్చి వరకు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 2014 ఎన్నికలలో ఆయన టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన ‘జనసేన పోరాట యాత్ర’ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతున్నారు.

అది ఎంతగా అంటే చంద్రబాబును విమర్శించడంలో జగన్ కు పోటీ ఇస్తున్నారు ఆయన. మొన్న అయితే ఏకంగా తనపై దాడి చెయ్యడానికి ముఖ్యమంత్రి కిరాయిగూండాలను పంపించారు అని అభియోగించారు. చంద్రబాబు బద్దశత్రువులు కూడా ఎప్పుడు ఇటువంటి ఆరోపణలు చెయ్యలేదు. అసలు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు ఎక్కడ చెడింది? ఇపుడు అందరిని వేధిస్తున్నారు ప్రశ్న.

అయితే జనసేన టీడీపీ పొత్తు చర్చలు విఫలం అవ్వడమే దీనికి కారణం అంటున్నారు. టీడీపీని జనసేన 50 సీట్లు అడగగా, చంద్రబాబు కేవలం 16 ఇస్తా అన్నారట. దీనిని పవన్ కళ్యాణ్ అవమానంగా ఫీల్ అయ్యారట. దీనికి ప్రతీకారంగానే తాను గెలవకపోయినా టీడీపీని ఓడిస్తా అని శబధం చేసి చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారట.