pawan kalyan confirms no more moviesపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కోసారి తనలోని నటుణ్ణి నిజ జీవితంలో కూడా ఆవిష్కరించినట్లుగానే ప్రవర్తిస్తాడు. అయితే ఆయన మంచి నటుడు అని అందరికీ తెలిసిందే కానీ. అక్కడే ఆయన నటనకు మరో మారు నూటికి నూరు మార్పులు వెయ్యక తప్పదు. విషయం ఏంటి అంటే, పవన్ కల్యాణ్ పొలిటికల్ స్పీచ్ లు ఇచ్చే సమయంలో చాలా ఉద్వేగంగా మాట్లాడతారు. అయితే ఆయన మాట్లాడే విధానానికి ఆయన ఫాన్స్ మాత్రమే కానీ, సగటు సామాన్యుడుకి రోమాలూ నిక్క పొడుచుకుంటాయి. అంత పవర్‌ఫుల్ గా మాట్లాడతారు పవన్ కల్యాణ్. అయితే సినిమా జీవితాన్ని పక్కన పెట్టి ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్ గా మారాలి అనుకున్న పవన్ ఇప్పటికీ పార్ట్ టైమ్ నాయకుడులాగానే ఉన్నాడు అన్న విమర్శలు లేకపోలేదు.

ఇదిలా ఉంటే మరో పక్క పవన్ గత పొలిటికల్ మీటింగ్స్ లో తన గత రెండు సినిమాలు తన ఫాన్స్ సరిగ్గా చూడలేదు అని, అందుకే తన దగ్గర డబ్బులు లేవు అని, ఒక పక్క సినిమాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూనే మరో పక్క పార్టీని బలోపేతం చేస్తాను అని చెప్పుకొచ్చిన మాటలు సగటు అభిమానుల కళ్ళల్లో నీళ్ళు తెప్పించిన సంఘటనలు ఉన్నాయి.. మరి ఈ క్రమంలో అప్పట్లో అసలు డబ్బులు లేక పార్టీని నడపలెనేమో అన్న భయంతో ఉన్న పవన్ తాజాగా తనపై వచ్చిన సినిమా న్యూస్ గురించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ విషయం ప్రకారం పవన్ తనపై త్వరలో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అని, అవన్నీ వదంతులు అని, అయితే తనకు సినిమాలు చేసే అంత టైమ్ లేదు అని, తన జీవితం ప్రజల కోసమే అంకితం అన్నట్లుగా తాను సినిమా చెయ్యడం లేదు అంటూ తేల్చి చెప్పేసాడు. అంతేకాదు “పూర్తి సమయం ప్రజా జీవితానికే” అన్న స్టేట్మెంట్ తో ప్రెస్ నోట్ ను జనసేన పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

అయితే ఇక్కడే కొన్ని ఆలోచించదగ్గ విషయాలు ఉన్నాయి, అవి ఏంటి అంటే, సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల తన వద్ద డబ్బు లేదన్న జనసేనాని, ఇప్పుడు సినిమాలు చేసే సమయమే లేదనడం కాస్త విచిత్రమే. మరో పక్క పొలిటికల్ పార్టీని నిర్మించడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. మరి సినిమాలు లేక ఆదాయం లేక పార్టీని ఎలా ముందుకు తీసుకేళ్తారో అన్న విషయం కూడా కాస్త ఆలోచించదగ్గదే. మరో కీలక విషయం ఏంటి అంటే, పూర్తి సమయం ప్రజా జీవితానికే అంకితం అంటున్న పవన్ కల్యాణ్, ఈ నిర్ణయాన్ని ఎన్నికల వరకే ఆచరిస్తారా? లేక 2019 ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా, ఈ మాటను తప్పకుండా ముందుకు సాగుతారా? ఎందుకంటే గతంలో మెగాస్టార్ కూడా ‘సామాజిక న్యాయం’ అంటూ తన సుధీర్ఘ కాల కృషి అయినటువంటి సినిమా ఫీల్డ్ కీ గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చి పొలిటికల్ గా విజయ సాధించకపోవడంతో మళ్లీ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారు. పవన్ కూడా అదే బాట పడితే ఆయన్ని నమ్మి వెనుక నడిచే వారి పరిస్థితి ఏమవుతుందో అన్నదే ఇప్పుడు ప్రశ్నార్ధకం అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అంతా పవన్ చేతుల్లోనే ఉంది.